తెలంగాణలో 50,000 తాత్కాలిక ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే ..?

కరోనా వల్ల దేశంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సరైన సమయంలో వైద్యం అందక చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ 50 వేల మంది వైద్య సిబ్బందిని ఉద్యోగాల్లో నియమించాలని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారో వారికి గౌరవప్రదమైన వేతనాలు లభిస్తాయి. తెలంగాణ సర్కారు వీరికి భవిష్యత్తు నియామకాల్లో వెయిటేజీ ఇవ్వనుండటం గమనార్హం. అధికారులు అర్హత ఉన్న […]

Written By: Navya, Updated On : May 10, 2021 4:38 pm
Follow us on

కరోనా వల్ల దేశంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సరైన సమయంలో వైద్యం అందక చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ 50 వేల మంది వైద్య సిబ్బందిని ఉద్యోగాల్లో నియమించాలని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారో వారికి గౌరవప్రదమైన వేతనాలు లభిస్తాయి.

తెలంగాణ సర్కారు వీరికి భవిష్యత్తు నియామకాల్లో వెయిటేజీ ఇవ్వనుండటం గమనార్హం. అధికారులు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసుపత్రుల్లో వైద్యులపై పని ఒత్తిడి తగ్గించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి యువ వైద్యులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునివ్వడం గమనార్హం.

https://odls.telangana.gov.in/medicalrecruitment/register.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం తాత్కాలికంగా మూడు నెలల్ కోసం ఈ ఉద్యోగులను నియమించుకోనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 22వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర రాజధానికి దూరంలో ఉన్న జిల్లా ఆసుపత్రులపై కూడ సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఆదిలాబాద్‌, వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.