https://oktelugu.com/

IIT Tirupati Jobs: ఐఐటీ తిరుపతిలో టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. లక్షకు పైగా వేతనంతో?

IIT Tirupati Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 29, 2021 / 03:57 PM IST
    Follow us on

    IIT Tirupati Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    IIT Tirupati Jobs

    సంబంధిత స్పెషలైజేషన్‌లో ఫస్ట్‌క్లాస్‌ పీహెచ్‌డీ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం మూడు సంవత్సరాల టీచింగ్, రీసెర్చ్, ఇండస్ట్రియల్ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. 38 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

    Also Read: ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

    ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 1,01,500 రూపాయల వేతనంతో పాటు ఇతర ఆలవెన్సులు కూడ లభిస్తాయి. అకడమిక్‌ క్వాలిఫికేషన్‌, పని అనుభవంను బట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక ప్రక్రియను చేపడతారని సమాచారం. 2021 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.iittp.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: భారత ప్రభుత్వ మింట్‌ లో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.90 వేల వేతనంతో?