ఎస్వీ యూనివర్సిటీలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

తిరుప‌తిలో ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. జూన్ 3వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. […]

Written By: Navya, Updated On : May 24, 2021 12:51 pm
Follow us on

తిరుప‌తిలో ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. జూన్ 3వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియ‌న్స్‌ పోస్టులను అధికారులు భర్తీ చేయనున్నారు. https://svvu.edu.in/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. మొత్తం 15 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉండగా పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలలో 2 చొప్పున మిగిలిన జిల్లాలలో 1 చొప్పున ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు 200 రూపాయలు కాగా మే నెల 28వ తేదీగా ఉంది. మే 21వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 3వ తేదీ దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://svvu.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభించనుంది.