
2020 సంవత్సరానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 6,506 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈరోజు నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. 2021 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
Also Read: నిరుద్యోగులకు ఎల్‌అండ్‌టీ శుభవార్త.. 1100 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..!
వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 6506 ఉద్యోగాలలో గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు 3,513 ఉండగా గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాలు 250, గ్రూప్ సి ఉద్యోగాలు 2743 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2021 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీలోగా ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలోపు ఏదైనా కారణం వల్ల ఫీజు చెల్లించడం సాధ్యం కాకపోతే 2021 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీలోపు చలాన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండగా మిగిలిన వారికి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: బీటెక్ విద్యార్థులకు విప్రో బంపర్ ఆఫర్.. మూడున్నర లక్షల వేతనంతో ఉద్యోగం..?
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2021 సంవత్సరం మే నెల 29వ తేదీ నుంచి 2021 సంవత్సరం జూన్ నెల 7వ తేదీ వరకు వరకు పరీక్షలు జరుగుతాయి. ఉద్యోగాలను బట్టి వయోపరిమితిలో మార్పులు ఉన్నాయి. డిగ్రీ చదివి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ https://ssc.nic.in/ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు