Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ జాబ్ చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. rbi.org.in వెబ్ సైట్ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నెల 15వ తేదీ నుంచి ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో , లైబ్రరీ ప్రొఫెషనల్ (అసిస్టెంట్ లైబ్రేరియన్) గ్రేడ్ ఎ 1, ఆర్కిటెక్ట్ గ్రేడ్ ఎ 1, టైమ్ క్యూరేటర్ 1 ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేసి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
త్వరలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.