SCR Railway Recruitment 2021: సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అటెండర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
https://screccs.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు కనీసం పదో తరగతి పాసై ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 5,200 రూపాయల నుంచి 20,200 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.
ఉద్యోగ ఖాళీల సంఖ్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రాతపరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాళ్లకు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.