
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 489 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎస్బీఐ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్బీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఎస్బీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 11 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
https://www.sbi.co.in/ , https://bank.sbi/web/career వెబ్ సైట్ లింక్ ల ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వేర్వేరు విద్యార్హతలతో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అర్హతలు ఉన్న పోస్టులకు మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు దరఖాస్తు ఫీజు లేదు. ఎస్బీఐ వెబ్ సైట్ లో apply online అనే ఆప్షన్ పై క్లిక్ చేసి click for new registration అనే ఆప్షన్ ను ఎంచుకుని పేరు, పుట్టినతేదీ, ఇతర వివరాలను నమోదు చేసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని ఉద్యోగాలకు అర్హతతో పాటు అనుభవం కూడా ఉండాలి. మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్), ఇంజినీర్ (ఫైర్) ఉద్యోగాలకు షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
అర్హత, అనుభవం ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి వేతనాలలో మార్పులు ఉంటాయి. వెబ్ సైట్ లోని నొటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పోస్టులు తక్కువ సంఖ్యలోనే ఉండటం వల్ల ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది.