SBI Recruitment 2021: ఎస్బీఐకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. పని, అనుభవనం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 606 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 23 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీలలో రిలేషన్ షిప్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 334, కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ 217 ఉద్యోగ ఖాళీలు, ఇన్వస్ట్‌మెంట్ ఆఫీసర్ 12 ఉద్యోగ ఖాళీలు, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ ఉద్యోగ ఖాళీలు 4, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు 1, మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 12, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 23 ఉన్నాయి. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా, ఇంటరాక్షన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 28వ తేదీన మొదలు కాగా 2021 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://sbi.co.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.