డిగ్రీతో ఎస్బీఐలో 6,100 జాబ్స్.. భారీ వేతనంతో?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 6,100 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో తెలంగాణలో 125 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఏపీలో 100 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ రాష్ట్రంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. […]

Written By: Navya, Updated On : July 7, 2021 8:12 am
Follow us on

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 6,100 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో తెలంగాణలో 125 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఏపీలో 100 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ రాష్ట్రంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జులై 26 ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 100 ఉద్యోగ ఖాళీలలో నెల్లూరు 8, శ్రీకాకుళంలో 8, విజయనగరంలో 8, విశాఖపట్నంలో 7, తూర్పు గోదావరిలో 8, పశ్చిమ గోదావరిలో 8, కృష్ణా జిల్లాలో 7, గుంటూరు జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో 8, చిత్తూరు జిల్లాలో 8, వైఎస్ఆర్ కడప జిల్లాలో 8, అనంతపురం జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 7 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

తెలంగాణలో 125 ఉద్యోగ ఖాళీలు ఉండగా వాటిలో మల్కాజ్ గిరిలో 2, అదిలాబాద్ లో 3, భద్రాద్రి కొత్తగూడెంలో 6, జగిత్యాల్ లో 2, జనగాంలో 3, జయశంకర్ భూపాలపల్లిలో 3, జోగులంబ గద్వాలలో 2, కామారెడ్డిలో 4, కరీంనగర్ లో 4, ఖమ్మంలో 7, కొమరంభీమ్ లో 2, యాదాద్రి భువనగిరిలో 4, వరంగల్ రూరల్ లో 3, వరంగల్ లో 1, వనపర్తిలో 3, వికారాబాద్ లో 6, సూర్యాపేటలో 7, సిరిసిల్లలో 2, సిద్ధిపేటలో 5, సంగారెడ్డిలో 5, రంగారెడ్డిలో 6 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

పెద్దపల్లిలో 3, నిజామాబాద్ లో 11, నిర్మల్ లో 3, నల్గొండలో 6, నాగర్‌కర్నూల్ లో 4, మెదక్ లో 4, మంచిర్యాలలో 2, మహబూబ్‌నగర్ లో 9, మహబూబాబాద్ లో 3 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.