స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డాక్టర్, నర్సు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 60 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు జార్ఖండ్‌లోని బొకారో జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
https://www.sail.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో కచ్చితంగా సర్టిఫికెట్లను తీసుకొని వెళ్లాలి. మొత్తం 60 ఉద్యోగ ఖాళీలలో డాక్టర్ ఉద్యోగ ఖాళీలు 30 ఉండగా నర్సు ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. ఎంబీబీఎస్ లేదా అంతకు మించిన విద్యార్హత ఉంటే డాక్టర్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్, ఇంటర్‌తోపాటు జీఎన్‌ఎం చదివిన వాళ్లు నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కాంట్రాక్ట్ పద్ధతిన 30 రోజులకు ఈ ఉద్యోగాలకు నియమించుకోనున్నారు. మే నెల 3వ తేదీ నుంచి మే నెల 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఎవరైతే ఈ ఇంటర్వ్యూలకు హాజరవుతారో వాళ్లు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తీసుకొని వెళ్లాలి. ఎంపికైన డాక్టర్లకు రోజుకు రూ.5000 చొప్పున వేతనం కాగా నర్సులకు రోజుకు రూ. 1000 అందిస్తారు. రోజుకు కేవలం 8 గంటలు డ్యూటీ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. భారీ వేతనం లభిస్తుండటంతో అర్హత ఉన్నవారికి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.