SAI Recruitment 2021: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 220 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
https://sportsauthorityofindia.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓరల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడం, ద్రోణాచార్య అవార్డు, కోచింగ్‌లో డిప్లొమా, ఒలింపిక్స్ లో పాల్గొన్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
2021 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. మొత్తం 220 పోస్టులు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుసగా రిలీజవుతున్న జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది. వరుసగా రిలీజవుతున్న జాబ్ నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చుతున్నాయి.