https://oktelugu.com/

‘గ్రేటర్’పై అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం.. స్పెషల్ పాలనకే మొగ్గు..!

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి జీహెచ్ఎంసీకి కూడా ముందస్తు ఎన్నికలు జరిగాయి. మూడునెలల పాలన ఉండగానే ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలు వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికలకు కలిసొచ్చిన ఈ వ్యూహం జీహెచ్ఎంసీ ఎన్నికల మాత్రం టీఆర్ఎస్ కు బెడిసి కొట్టింది. Also Read: రైతుల ఆందోళన.. ప్రతిపక్షాల కుట్రనా..! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55.. బీజేపీ 48.. ఎంఐఎం 44.. కాంగ్రెస్ కు 2స్థానాలు దక్కాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో గ్రేటర్లో హంగ్ ఏర్పడింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 11:36 am
    Follow us on

    GHMC
    ముందస్తు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి జీహెచ్ఎంసీకి కూడా ముందస్తు ఎన్నికలు జరిగాయి. మూడునెలల పాలన ఉండగానే ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలు వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికలకు కలిసొచ్చిన ఈ వ్యూహం జీహెచ్ఎంసీ ఎన్నికల మాత్రం టీఆర్ఎస్ కు బెడిసి కొట్టింది.

    Also Read: రైతుల ఆందోళన.. ప్రతిపక్షాల కుట్రనా..!

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55.. బీజేపీ 48.. ఎంఐఎం 44.. కాంగ్రెస్ కు 2స్థానాలు దక్కాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో గ్రేటర్లో హంగ్ ఏర్పడింది. ఎక్స్ ఆఫీషియో ఓట్లు కలుపుకున్నప్పటికీ టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకోలేని పరిస్థితిలో ఉంది. దీంతో ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి కోరాల్సిన అవసరం ఆ పార్టీకి ఏర్పడింది.

    గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కనీసం 70స్థానాలు వచ్చినా ఎక్స్ ఆఫీషియో ఓట్లతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేది. కాంగ్రెస్ కు కేవలం రెండు సీట్లు రాగా.. ఇండిపెండెంట్లు ఒకరు కూడా గెలువలేదు. టీఆర్ఎస్.. బీజేపీ పొత్తు ఎలాగు కుదరనందునా.. టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

    టీఆర్ఎస్-ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న లేదా మద్దతు తీసుకున్నా అది బీజేపీకి అడ్వంటేజీగా మారనుంది. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ మారిన నేపథ్యంలో ఆపార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఎంఐఎంతో పొత్తుకానీ.. మద్దతుగానీ తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.

    Also Read: రైతును రాజుగా బతకనివ్వండి.. బానిసగా మార్చొద్దు: పీపుల్స్ స్టార్

    ఫిబ్రవరి 10వ తేది వరకు ప్రస్తుత పాలకవర్గానికి గడువు ఉంది. దీంతో అప్పటిలోగా మేయర్ ఎన్నిక జరుగాల్సి ఉంటుంది. మేయర్ పదవీ కోసం టీఆర్ఎస్ ఎంఐఎం మద్దతు తీసుకుంటే ఆ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడనుంది. దీంతో సీఎం కేసీఆర్ మేయర్ సీటును వదిలేసేందుకు మొగ్గుచూపుతున్నారనే టాక్ విన్పిస్తోంది.

    ఇదిలా ఉంటే మేయర్ పీఠం టీఆర్ఎస్ కు దక్కాలంటే మరో పది నుంచి పదిహేను సీట్లు టీఆర్ఎస్ కు కావాల్సి ఉంటుంది. మేయర్ ఎంపికకు మరో రెండు నెలల సమయం ఉండటంతో బీజేపీ నుంచి గానీ ఎంఐఎం నుంచిగానీ కొంతమంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ కు జై కొడితే పరిస్థితి మారే అవకాశం ఉంది. ఇది జరుగని పక్షంలో మాత్రం గ్రేటర్లో స్పెషల్ పాలన విధించేందుకే కేసీఆర్ మొగ్గుచూపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్