RRB Group-D Recruitment: భారతీయ రైల్వే ఈ ఏడాది ప్రారంభంలోనే నిరుద్యగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్-D రిక్రూట్మెంట్ డ్రైవ్ 32,438 ఖాళీలకు నోటిఫికేషన్(RRB CEN నం. 08/2024) ఇచ్చింది. జనవరి 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 32,438 ఖాళీల కోసం డ్రైవ్ జరగనుంది. నమోదు చేసుకోవడానికి చివరి మొదట ఫిబ్రవరి 22గా ప్రకటించింది. దరఖాస్తు రుసుము చెల్లింపు ఫిబ్రవరి 24 వరకు అవకాశం కల్పించింది. అయితే అభ్యర్థుల విన్నపం మేరకు గడువును మార్చి 1(శనివారం)వరకు పొడగించింది. ఫీజు చెల్లింపునకు మార్చి 3 వరకు అవకాశం కల్పించింది. రేపటితో ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది.
Also Read : RRB టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 : 1038 ఎంఐ ఖాళీలు.. పరీక్ష వివరాలు ఇవీ..
దరఖాస్తు రుసుము:
RRB గ్రూప్ D పరీక్ష రుసుము రూ. 500, మహిళా, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు- SC/ ST/ OBC/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 250.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, శారీరక సామర్థ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. RRB గ్రూప్ D పేపర్ 100 ప్రశ్నలను కలిగి ఉంటుంది మరియు వ్యవధి 90 నిమిషాలు.
మార్కింగ్ విధానం: ప్రతి తప్పు సమాధానానికి, 1/3 మార్కులు తగ్గిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి
RRB గ్రూప్ D పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు RRB వెబ్సైట్లను సందర్శించాలి. RRB గ్రూప్ D రిజిస్ట్రేషన్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి. దరఖాస్తు ఫారమ్‌లో వివరాలను నమోదు చేసి, పత్రాలను అప్లోడ్ చేయండి. RRB గ్రూప్ D దరఖాస్తు రుసుము చెల్లించి, సమర్పించుపై క్లిక్ చేయండి. RRB గ్రూప్ D దరఖాస్తు ఫారమ్ PDFని సేవ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.
RRB గ్రూప్ D రిక్రూట్మెంట్ 2024: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి RRB వెబ్సైట్లు
ఆర్ఆర్బీ అహ్మదాబాద్- www.rrbahmedabad.gov.in
RRB అలహాబాద్- www.rrbald.gov.in
RRB బెంగళూరు- www.rrbbnc.gov.in
RRB భోపాల్- www.rrbbpl.nic.in
RRB భువనేశ్వర్- www.rrbbbs.gov.in
RRB బిలాస్పూర్- www.rrbbilaspur.gov.in
RRB చండీగఢ్- www.rrbcdg.gov.in
RRB చెన్నై- www.rrbchennai.gov.in
RRB గోరఖ్‌పూర్- www.rrbgkp.gov.in
RRB గౌహతి- www.rrbguwahati.gov.in
ఆర్ఆర్బీ జమ్మూ- www.rrbjammu.nic.in
RRB కోల్‌కతా- www.rrbkolkata.gov.in
RRB మాల్డా- www.rrbmalda.gov.in
RRB ముంబై- www.rrbmumbai.gov.in
RRB ముజఫర్‌పూర్- www.rrbmuzaffarpur.gov.in
RRB పాట్నా- www.rrbpatna.gov.in
RRB రాంచీ- www.rrbranchi.gov.in
RRB సికింద్రాబాద్- www.rrbsecunderabad.nic.in
RRB సిలిగురి- www.rrbsiliguri.org
RRB త్రివేండ్రం- www.rrbthuruvan.gov.in.
RRB గ్రూప్ D రిక్రూట్మెంట్ 2024 వివరాల కోసం, దయచేసి RRB వెబ్సైట్లను సందర్శించండి.