TSPSC
TSPSC: తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా టీఎస్‌పీఎస్సీ ర్యాంకింగ్స్ జాబితాను శనివారం విడుదల చేసింది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితా ప్రకటించింది. ఈ జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించింది.
247 పోస్టులకు పరీక్ష..
పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 247 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు సబ్జెకుల వారీగా పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు రాసిన అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించింది. తాజాగా ఆ జాబితాను విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి అనే సమాచారం తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ర్యాంకుల జాబితా కోసం www.tspsc.gov.in/GRLPL13570AS సైట్‌ను సందర్శించాలని సూచించింది.
ఎన్నికల తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్..
లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రస్తుతం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండయపోవచ్చని తెలుస్తోంది. మే 13న ఎన్నికలు ఉన్నందున, ఆ తర్వాత లేదా జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. 6వ తేదీతో కోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత గానీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Release of polytechnic lecturer posts rankings
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com