నిరుద్యోగులకు ఆర్బీఐ శుభవార్త.. రూ.83 వేల వేతనంతో ఉద్యోగాలు..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 322 ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.rbi.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ముంబైలో ఆర్బీఐ సర్వీసెస్ బోర్డ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 322 ఉద్యోగాలలో ఆఫీస‌ర్స్ […]

Written By: Navya, Updated On : January 29, 2021 7:30 pm
Follow us on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 322 ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.rbi.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ముంబైలో ఆర్బీఐ సర్వీసెస్ బోర్డ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మొత్తం 322 ఉద్యోగాలలో ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్‌-బి (డీఆర్‌) జ‌న‌ర‌ల్‌-పీవై 2021 ఉద్యోగాలు 270 ఉండగా కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేష‌న్/ స‌ంబంధిత టెక్నిక‌ల్ స‌బ్జెక్టులు చదివి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్-బీ (డీఆర్‌‌) డీఈపీఆర్‌-పీవై 2021 ఉద్యోగ ఖాళీలు 29 ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీ, పీజీడీఎం/ ఎంబీఏ (ఫైనాన్స్‌) చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్‌-బీ (డీఆర్‌) డీఎస్ఐఎం-పీవై 2021 ఉద్యోగ ఖాళీలు 23 ఉండగా కనీసం 53 శాతం మార్కులతో మాస్ట‌ర్స్ డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఇంట‌ర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

2021 సంవత్సరం జనవరి 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు రూ. 83 వేల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది.