https://oktelugu.com/

నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త.. 554 ఉద్యోగాలు..?

దేశంలోని నిరుద్యోగులలో చాలామంది రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. రైల్వే శాఖ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. 554 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు రైల్వే శాఖ నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వేర్వేరు రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్లను విడుదల చేయగా నార్త్ సెంట్రల్ రైల్వేలో 480 అప్రెంటీస్ ఖాళీల భర్తీ, రైల్వేనిర్మాణ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో 74 ఉద్యోగ ఖాళీల భర్తీ […]

Written By: Kusuma Aggunna, Updated On : April 4, 2021 7:21 pm
Follow us on

దేశంలోని నిరుద్యోగులలో చాలామంది రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. రైల్వే శాఖ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. 554 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు రైల్వే శాఖ నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వేర్వేరు రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్లను విడుదల చేయగా నార్త్ సెంట్రల్ రైల్వేలో 480 అప్రెంటీస్ ఖాళీల భర్తీ, రైల్వేనిర్మాణ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో 74 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

టెన్త్, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 480 ఉద్యోగ ఖాళీలలో ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 286, వెల్డర్ 11, మెకానిక్ 84, కార్పెంటర్ 11, ఎలక్ట్రీషియన్ 88 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్సీవీటీ అనుబంధ సంస్థ నుంచి ఐటీఐ పాసై ఉండాలి. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. జనరల్‌ అభ్యర్థులు 170 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. https://ncr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 74 వర్క్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ చేయనుంది.

ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 18 చివరితేదీగా ఉండగా సివిల్ ఇంజనీరింగ్ లో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 36,000 వేతనంగా లభిస్తుంది.