
Qentelli Recruitment 2021: ప్రముఖ కంపెనీలలో ఒకటైన క్వెంటెల్లి నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 500 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. హైదరాబాద్ నగరంలో వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ఈ సంస్థ భావిస్తుండటం గమనార్హం. ఫుల్ స్టాక్ డెవలపర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, ఆటోమేషన్ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగ ఖాళీలు ఈ సంస్థ ద్వారా భర్తీ కానున్నాయి. డిసెంబర్ నాటికి కంపెనీ ఉద్యోగులను నియమించుకోనుంది.
2023 సంవత్సరం నాటికి ఈ కంపెనీ బిలియన్ డాలర్ కు వాల్యుయేషన్ ను పెంచుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు క్వెంటెల్లి కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఇన్నోవేషన్స్ కొరకు క్వెంటెల్లి ప్రత్యేకంగా ల్యాబ్ ను ఏర్పాటు చేయడం గమనార్హం. 2016 సంవత్సరం నుంచి ఈ సంస్థ రీసెర్చ్‌లు చేస్తుండగా కరోనా వల్ల గతేడాది ప్రయోగాలను ఆపేసింది.
ప్రముఖ టెక్నాలజీ కంపెనీలలో ఒకటైన క్వెంటెల్లి ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది. మరోవైపు ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటనలు చేశాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. కరోనా వల్ల గతేడాది, ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగెలేదు.
దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.