Python Programming Language: ఒకప్పుడు అంటే చదివిన చదువు తగ్గట్టు ఉద్యోగాలు లభించేవి.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చదువు మారింది. చేస్తున్న కొలువూ మారింది. ఉద్యోగం పురుష లక్షణం అనే సామెత నుంచి ఉద్యోగం మనిషి సహజ లక్షణం అనే స్థాయికి సామెత ఎదిగింది. ఇప్పుడు మొత్తం మనిషి జీవితం సాంకేతిక పరిజ్ఞానం చుట్టే తిరుగుతోంది. ఒకప్పుడు సి, సి ప్లస్, జావా నేర్చుకుంటే చాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రపంచాన్ని దున్నేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది బాస్. పరిగెత్తి పాలు తాగడం కాదు.. పాలు కాచుకొని కాఫీ లేదా టీ పెట్టుకొని తాగడమే ఇప్పుడు ట్రెండ్. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కొత్త కోర్సులు వెలుగులోకి వస్తున్నాయి. అలా వచ్చిందే పైథాన్. స్థూలంగా చెప్పాలంటే ఇప్పటి మిలీనియల్ తరానికి ఓ కొలువుల కొండ. ఏంటి పైథాన్ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? ఇది మీరు అనుకుంటున్న కొండచిలువ కాదు. ఇంతకీ ఏమిటి ఈ పైథాన్, తాజా అప్డేషన్ ఏమిటి? ఇది నేర్చుకుంటే ఎటువంటి కొలువులు లభిస్తాయి? దేనికి ఎందుకంత ప్రాధాన్యం లభిస్తోంది? ఓ లుక్కేయండి.

ప్రాచుర్యం పొందిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
వివిధ ప్రాంతాల ప్రజలకు వేర్వేరు భాషలు ఎలా ఉన్నాయో.. కంప్యూటర్లకు కూడా అలాగే లాంగ్వేజస్ ఉన్నాయి. కోడింగ్ రూపంలో ఉండే ఈ భాషలను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. ఇప్పుడు తాజాగా 3.11 సిరీస్ ని అభివృద్ధి చేసింది. సరళమైన, సంక్షిప్తమైన కోడింగ్ కలిగిన భాష కావడంతో డెవలపర్లకు డిమాండ్ పెరుగుతోంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, స్క్రిప్ట్ రైటింగ్, డేటా సైన్స్ వంటి అనేక విభాగాల్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. అనేక కంప్యూటర్ లాంగ్వేజ్ లలో పోటీపడి ఎంతోకాలంగా తన స్థానాన్ని పైథాన్ పదిలం చేసుకున్నది. ప్రపంచంలోనే ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీలు గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ మొదలైనవి పైథాన్ ను ఉపయోగిస్తున్నాయి. దీంతో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నైపుణ్యాలు సాధించిన వారికి విస్తృత కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి.
ఎవరు నేర్చుకోవచ్చు
సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలని ఆసక్తి ఉండి.. బ్యాచిలర్ స్థాయి కోర్సులు పూర్తి చేసిన వారు పైథాన్ ప్రోగ్రామింగ్ పై దృష్టి సారించవచ్చు. అందుబాటులో ఉన్న సర్టిఫికేషనల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. ఐబీఎం, సిస్కో, వీఎం వేర్ వంటి సంస్థలు అందించే ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులకు ఆదరణ లభిస్తుంది. పైథాన్ ప్రోగ్రామర్ గా రాణించాలనుకునే వారికోసం పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ విత్ పైథాన్ కోర్స్, సర్టిఫికెట్ ప్రోగ్రాం మెషిన్ లెర్నింగ్, ఏఐ విత్ పైథాన్, పైథాన్ ట్రైనింగ్ కోర్స్, మిషన్ లెర్నింగ్ విత్ పైథాన్, పైథాన్ స్క్రిప్టింగ్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మూక్స్ విధానంలో అన్ లైన్ విధానంలో ఈ కోర్సు పై అవగాహన పెంచుకోవచ్చు ఈ లాంగ్వేజ్ ను యూట్యూబ్ లో ఉచితంగానే నేర్చుకునే అవకాశం ఉంది.
కెరీర్ అవకాశాలు ఇలా
పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నైపుణ్యాలు సాధించిన వారు ప్రాథమికంగా డెవలపర్ గా కెరీర్ ప్రారంభించవచ్చు. వీరు వెబ్ సైట్ లను రూపొందించడం, డేటా అనలిటిక్స్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, అర్థవంతమైన కోడింగ్ రాయడం, డేటా ఆల్గారిథమ్ లను ఆప్టి మైజ్ చేయడం, డేటా ప్రొటెక్షన్, సెక్యూరిటీ బాధ్యతలను నిర్వహిస్తారు. పైథాన్ నిపుణులు డేటా అనలిస్ట్ గా పనిచేయవచ్చు. భారీ మొత్తంలో ఉండే డేటా నిర్వహణ కోసం చాలా కంపెనీలు వీరిని నియమించుకుంటున్నాయి. ప్రోడక్ట్ మేనేజర్ గారు పలు కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఏదైనా ఉత్పత్తికి సంబంధించిన కొత్త ఫీచర్లతో కూడిన ప్రొడక్టులను వీరు నిర్మిస్తారు. పైథాన్ లో నైపుణ్యం కలిగిన ప్రోడక్ట్ మేనేజర్లకూ విపరీతమైన డిమాండ్ ఉంది. గత రెండు సంవత్సరాలలో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఉద్యోగాలు భారీగా పెరిగాయి . యంత్రాలు, ప్రోగ్రాములు, ఇతర కంప్యూటర్ ఆదారిత సిస్టంలను రూపొందించడంలో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అది ప్రధాన పాత్ర.
వేతనాలు కూడా అదే స్థాయిలో
పైథాన్ పై పట్టు సాధించి ఉద్యోగాల్లో చేరిన వారు లక్షల్లో వేతనాలు అందుకోవచ్చు. నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్వేర్ డెవలపర్ సగటు వేతనం ఏడాదికి ఐదు లక్షలు గా ఉంది. అనుభవంతో పాటు అదనపు స్కిల్స్ ఉంటే వార్షిక వేతనం 10 లక్షల వరకు అందుతుంది. అమెజాన్, యాక్సెంచర్, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి ప్రఖ్యాత సంస్థలు నైపుణ్యం కలిగిన డెవలపర్లను ఆకర్షణీయ వేతనాలతో నియమించుకుంటున్నాయి. టీం లీడర్, ప్రాజెక్టు మేనేజర్, డేటా సైంటిస్టులు, బిజినెస్ అనలిస్ట్, మిషన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్ స్థాయిలో చేరితే ఏడాదికి 20 లక్షలకు పైగా వేతనం అందుకోవచ్చు.

3.11 సీరీస్ లో ఏముంది అంటే
నాన్ ప్రొడక్షన్ కోడ్ పై తాజా వెర్షన్ ప్రోగ్రామ్లతో కలిసి పనిచేస్తుందో లేదో ధ్రువీకరించేందుకు ఉపయోగపడుతుంది. కోడ్ పనితీరు మెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. పైథాన్ 3.11 సీరీస్ లో అడాప్టివ్ ఇంటర్ ప్రెటర్ ను జోడించారు. ఇందులో ఆబ్జెక్ట్ రకం చాలా అరుదుగా మారుతూ ఉంటుంది. ఇంటర్ ప్రెటర్ రన్నింగ్ కోడ్ ను విశ్లేషించి సాధారణ బైట్ కోడ్ లను టైప్_ నిర్దిష్టమైన వాటితో భర్తీ చేసేందుకు వీలుంటుంది. ఉదాహరణకు బైనరీ కార్యకలాపాలు, పూర్ణాంకాలు, ప్లోట్ లు, స్ట్రింగ్ లను ఎప్పటికప్పుడు సంస్కరించవచ్చు. పైథాన్ 3.11 లో తక్కువ ఓవర్ హెడ్ అవసరం పడుతుంది. తక్కువ మెమరీ ఉపయోగిస్తాయి. రికర్సివ్ కాల్, టెయిల్ ఆప్టిమైజ్ చేసే అవకాశం లేకపోయినప్పటికీ ఇది సిరీస్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది.