https://oktelugu.com/

Jobs: రేపే లాస్ట్‌ డేట్.. ఈ పోలీస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి!

కానిస్టేబుల్‌ పోస్టులకు పదో తరగతి, ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులు నిర్ధిష్టమైన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 13, 2024 / 02:07 PM IST

    Jobs

    Follow us on

    Jobs: రైల్వే శాఖలో పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం (మే 14 తేదీ)తో గడువు ముగియనుంది. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్, రైల్వే ప్రొటక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో 4,660 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది.

    నోటిఫికేషన్‌ ముఖ్యాంశాలు..
    – మొత్తం పోస్టులు 4,660. వీటిలో 4,208 కానిస్టేబుల్‌ పోస్టులు, 452 ఎస్సై పోస్టులు ఉన్నాయి.

    అర్హతలు..
    కానిస్టేబుల్‌ పోస్టులకు పదో తరగతి, ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులు నిర్ధిష్టమైన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 2024, జూలై 1 నాటికి కానిస్టేబుల్‌ అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సై ఉద్యోగాలకు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

    ఎంపిక ప్రక్రియ ఇలా..
    ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఫిజికల్‌ ఎఫీషియెన్సీ, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ తదితర పరీక్షలు నిర్వíß స్తారు. వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

    దరఖాస్తు రుసుం..
    ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళలు/ట్రా¯Œ ్సజెండర్స్‌/మైనారిటీ/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500. పరీక్షకు హాజరైతే రూ.400 రిఫండ్‌ చేస్తారు.

    వేతనం ఇలా..
    ఇక ఎస్సై పోస్టులకు వేతనం రూ.35,400, కానిస్టేబుల్‌ పోస్టులకు వేతనం రూ.21,700 చొప్పున