
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ మహిళా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 50 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా మే 6వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాలలో ఉద్యోగ ఖాళీలు ఉండగా గేట్-2021 స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం 50 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీలు 22 ఉండగా మెకానికల్ ఉద్యోగ ఖాళీలు 14, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉద్యోగ ఖాళీలు 14 ఉన్నాయి. సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులు. గేట్ 2021 మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. https://ntpccareers.net/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించి సందేహాలు ఉంటే నోటిఫికేషన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
గేట్-2021లో మంచి స్కోర్ సాధించిన మహిళా అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తుండటం గమనార్హం.