బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. రూ.61,400 వేతనంతో..?

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ పని చేస్తుండటం గమనార్హం. ఈ సంస్థ ద్వారా వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజైంది. 26 ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఇంజినీర్‌ పోస్టులను సంస్థ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండటం గమనార్హం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 29వ తేదీలోపు ఈ […]

Written By: Navya, Updated On : July 3, 2021 3:36 pm
Follow us on

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ పని చేస్తుండటం గమనార్హం. ఈ సంస్థ ద్వారా వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజైంది. 26 ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఇంజినీర్‌ పోస్టులను సంస్థ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండటం గమనార్హం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జులై 29వ తేదీలోపు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు కర్ణాటకలోని కైగా సైట్‌లో పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. https://npcilcareers.co.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఇంజినీరింగ్‌ లలో ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 61,400 రూపాయల వేతనం లభిస్తుందని సమాచారం. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై నెల 9వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

మొత్తం 26 పోస్టులలో సివిల్ 11, మెకానికల్‌ 8, ఎలక్ట్రికల్‌ 4, సీ అండ్‌ ఐఈసీ 2, సీఅండ్‌ఐ సీఎస్‌ 1 ఉన్నాయి. భారీ వేతనం లబించే ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.