Agniveer Army Recruitment
Agniveer Army Recruitment : ఏపీలో( Andhra Pradesh) నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్మీ అగ్ని వీరుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్.. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. అగ్ని వీర్ సిబ్బంది నియామకాలు 2025 -26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్ని వీర్ల నియామక కోసం వెబ్సైట్, ఇతర వివరాలను ప్రకటించింది. అగ్ని వీర్ పథకం కింద ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులు.. అధికారిక వెబ్సైట్ www. Joinindianarmy. nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు.
Also Read : ఏపీలో పదో తరగతి పరీక్షలు.. ప్రభుత్వ సంచలన ఆదేశాలు!
* ప్రాంతీయ భాషల్లో పరీక్ష..
వివిధ విభాగాల్లో నియామక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తుల నమోదుకు( applications ) చివరి తేదీ ఏప్రిల్ 10. ఇందులో ఒక్క అభ్యర్థి ప్రస్తుతం 2 వేరువేరు అగ్ని వీర్ క్యాటగిరి లకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా నియామకాలు చేపడతారు. అయితే తొలిసారిగా తెలుగుతో సహా 13 వేరువేరు భాషల్లో ఈ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతోంది.
* వారికి ప్రత్యేకం..
ఎన్.సి.సి( NCC) ఉన్నవారికి ప్రత్యేక పరిగణలోకి తీసుకుంటారు. ఎ,బి,సి సర్టిఫికెట్ కలిగిన వారికి, విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు, అగ్ని వీర్ టెక్నికల్ క్యాటగిరి కోసం ఐటిఐ / డిప్లమో అర్హత కలిగిన అభ్యర్థులకు అదనపు మార్పులు కూడా ఇస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ పునీత్ కుమార్ తెలిపారు.
* ఈ కింది జిల్లాల వారికి..
ఏపీలోని గుంటూరు( Gunturu ), కర్నూలు, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనంతపురం, వైయస్సార్ కడప, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్య సాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దళారులను నమ్మవద్దని.. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు అధికారులు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Notification released for the recruitment of army agniveer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com