NCL Recruitment 2022: పది అర్హతతో మంచి వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

NCL Recruitment 2022: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురును అందించింది. డంపర్ ఆపరేటర్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మొత్తం 307 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా nclcil.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి […]

Written By: Kusuma Aggunna, Updated On : January 21, 2022 11:26 am
Follow us on

NCL Recruitment 2022: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురును అందించింది. డంపర్ ఆపరేటర్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మొత్తం 307 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా nclcil.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

NCL Recruitment 2022

ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా వెబ్‌సైట్‌లోని రిక్రూట్‌మెంట్ విభాగం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతున్న నేపథ్యంలో అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. హైస్కూల్ / మెట్రిక్యులేషన్ / ssc పరీక్షలో అర్హత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

Also Read: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ లేదా ఎన్.సీవీటీ సర్టిఫికెట్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. నిర్దేశించిన ప్రమాణాలు, పొందిన మార్కుల ప్రకారం, మెరిట్ జాబితాను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎన్సీఎల్ హెల్ప్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 07805 – 226573 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

rectt.ncl@coalindia.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులు సంతోషిస్తున్నారు.

Also Read: పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. ఎలా అంటే?