జమ్మూలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 34 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, కంప్యూటర్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. మిగిలిన వాళ్లకు 1,000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది.
https://iitjammu.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.