విద్యార్థులకు శుభవార్త.. పది రోజులు నో స్కూల్ బ్యాగ్ డే..!

కేంద్ర విద్యాశాఖ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నో స్కూల్‌ బ్యాగ్‌ డే పేరుతో స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ-2020ని కేంద్రం అమలులోకి తెచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఇకపై విద్యార్థులు సంవత్సరంలో పది రోజులు స్కూల్ కు బ్యాగ్ లేకుండా హాజరు కావచ్చు. దీంతో స్కూల్ బ్యాగ్ బరువు విషయంలో సైతం కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల వయస్సు, తరగతులను బట్టి వారి బరువులో కేవలం 10 శాతం మాత్రమే బ్యాగ్ బరువు ఉండేలా […]

Written By: Navya, Updated On : December 6, 2020 3:08 pm
Follow us on

కేంద్ర విద్యాశాఖ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నో స్కూల్‌ బ్యాగ్‌ డే పేరుతో స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ-2020ని కేంద్రం అమలులోకి తెచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఇకపై విద్యార్థులు సంవత్సరంలో పది రోజులు స్కూల్ కు బ్యాగ్ లేకుండా హాజరు కావచ్చు. దీంతో స్కూల్ బ్యాగ్ బరువు విషయంలో సైతం కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల వయస్సు, తరగతులను బట్టి వారి బరువులో కేవలం 10 శాతం మాత్రమే బ్యాగ్ బరువు ఉండేలా చూడాలని విద్యాశాఖ పేర్కొంది.

స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ-2020 కు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు సూచనలు చేసింది. పాలసీ అమలు కోసం చర్యలు తీసుకున్న తరువాత నివేదికలను రూపొందించి పంపాలని కేంద్ర విద్యాశాఖ లేఖలో పేర్కొంది. ప్రతి పాఠశాలలో డిజిటల్ వెయింగ్ మిషన్ ఉండాలని 90 రోజులకు ఒకసారి విద్యార్థుల స్కూల్ బ్యాగ్ లను తూకం వేయాలని కేంద్రం తెలిపింది.

నో స్కూల్ బ్యాగ్ డే రోజున పాఠశాలల్లో పాటల పోటీలు, ఆటల పోటీలు, క్విజ్ నిర్వహించాలని కేంద్రం సూచించింది. అధికారులు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ బరువు గురించి సూచనలు చేయాలని.. ఒకటి, రెండు తరగతులకు చెందిన విద్యార్థుల నోట్ బుక్స్ పలుచని పేపర్ తో ఉండేలా చూడాలని విద్యాశాఖ కార్యదర్శులను కేంద్ర విద్యాశాఖ కోరింది. గతంలో ఒక కేసులో కోర్టు తీర్పు మేరకు కేంద్రం స్కూల్ బ్యాగ్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేంద్రం ఏడుగురు నిపుణులతో ఒక కమిటీని నియమించి దేశంలోని 352 పాఠశాలల్లో స్కూల్ బ్యాగ్ బరువు గురించి సర్వేలు నిర్వహించి ఆ సర్వే ద్వారా విద్యార్థులు స్కూల్ బ్యాగ్ సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే 3 కేజీలు ఎక్కువగా ఉంటున్నట్టు తేల్చింది. దీంతో కేంద్రం స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ-2020 ను అమలులోకి తెచ్చింది.