https://oktelugu.com/

Jobs: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Jobs: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ సంస్థ భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన సంస్థ కాగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ప్రాజెక్ట్ అసోసియేట్, ఫైనాన్స్ అసోసియేట్, ఆఫీస్‌ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 20, 2022 / 06:50 PM IST
    Follow us on

    Jobs: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ సంస్థ భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన సంస్థ కాగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

    ప్రాజెక్ట్ అసోసియేట్, ఫైనాన్స్ అసోసియేట్, ఆఫీస్‌ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్‌, డేటా అనలిస్ట్‌ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సోషల్‌ సైన్సెస్‌/ మేనేజ్‌మెంట్/ హ్యుమానిటీస్‌/ సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పాసై సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

    సంబంధిత పనిలో అనుభవంతో పాటు సోషల్‌ సైన్సెస్‌/ మేనేజ్‌మెంట్‌/ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పాసైన వాళ్లు డేటా అనలిస్ట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సోషల్‌ సైన్సెస్‌/ కామర్స్‌/ మేనేజ్‌మెంట్‌/ హ్యుమానిటీస్‌లో ఎం.ఏ పాసైన వాళ్లు ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

    ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లో మూడేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఫైనాన్స్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2022 సంవత్సరం జనవరి 26వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. http://nirdpr.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

    అనుభవం ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది. రాతపరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.