NHPC Recruitment 2021: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 173 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా ఈ సంస్థ మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. nhpcindia.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ 30 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
మొత్తం ఉద్యోగ ఖాళీలలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ 13, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 34, జూనియర్ ఇంజనీర్ (సివిల్) 68, జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) 31 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ రాజభాషా అధికారి ఉద్యోగ ఖాళీలు 7 ఉండగా సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలు 20 ఉన్నాయి. nhpcindia.com వెబ్ సైట్ లో కెరీర్స్ పై క్లిక్ చేసి లాగిన్ వివరాలను ఎంటర్ చేసి ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఆ తర్వాత దరఖాస్తు ఫీజును చెల్లించి అప్లికేషన్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ పరీక్షలో మెరిట్ ను బట్టి తుది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దేశంలోని 22 ప్రధాన నగరాల్లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఆన్ లైన్ పరీక్ష జరుగుతుంది. ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూసీ, జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉంది.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు మన దేశంలో లేదా విదేశాలలో ఎన్‌హెచ్‌పీసీ జాయింట్ వెంచర్స్ సబ్సిడరీ కంపెనీలలో పని చేయాల్సి ఉంటుంది.