NGRI Recruitment: సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిరుద్యోగులకు తాజాగా శుభవార్త చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ సంస్థ నుంచి విడుదలైంది. 18 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ సంస్థ హైదరాబాద్ లో ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రోమాగ్నటిక్ జియోఫిజిక్స్, సెసిమిక్/ సెస్మాలజీ, గ్రావిటీ/ జీపీఎస్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. సంబంధిత స్పెషలైజేన్లలో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 32 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అకడమిక్ అర్హత ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు లేదు. మిగిలిన అభ్యర్థులకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో 1,16,398 రూపాయలు వేతనంగా లభించే అవకాశం ఉంటుంది.
07 – 12 – 2021 తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం జనవరి 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.ngri.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.