భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 23 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. సీనియర్ ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, మెటీరియల్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో జూన్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారు ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో పని చేయాల్సి ఉంటుంది. https://www.nationalfertilizers.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండటంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 26వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది. మొత్తం 23 ఉద్యోగ ఖాళీలలో మెటీరియల్స్ ఆఫీసర్ 10, అసిస్టెంట్ మేనేజర్ 4, అకౌంట్స్ ఆఫీసర్ 7, సీనియర్ ఇంజినీర్ 2 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హతలు ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీని బట్టి అనుభవానికి సంబంధించిన అర్హతలు వేరువేరుగా ఉంటాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతున్నప్పటికీ వరుసగా వెలువడుతున్న నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.