Naval Ship Repair Yard Recruitment 2021: ఇండియన్ నేవీ తాజాగా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 302 ట్రేడ్స్‌మెన్ (స్కిల్డ్) ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసిగ్నేటెడ్ ట్రేడ్, నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన 50 రోజుల్లోగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆగస్టు 20 -27 ఎడిషన్‌లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రచురించారు. https://www.indiannavy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. పది అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ చేసిన వాళ్లు మాత్రమే ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలైన 50 రోజుల్లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్ లోని సౌత్ అండమాన్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను సులువుగా పంపవచ్చు.
ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వేర్వేదు ఉద్యోగ ఖాళీలు ఉండగా వెబ్ సైట్ ద్వారానే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.