
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 36 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా జూన్ 1వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం.
ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు పుణేలోని ల్యాబ్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. https://www.niv.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. మొత్తం 36 ఉద్యోగ ఖాళీలలో ల్యాబొరేటరీ సపోర్ట్ ఉద్యోగ ఖాళీలు 24 ఉండగా సైంటిఫిక్ సపోర్ట్ ఉద్యోగ ఖాళీలు 4, అడ్మిన్ సపోర్ట్ ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి.
ఉద్యోగాలను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు అర్హతను బట్టి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా నింపి ఈ-మెయిల్ చేయాల్సి ఉంటుంది. recruitmentniv@gmail.com ఈ మెయిల్ చేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లకు భారీ వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చిఎకూరనుంది.