https://oktelugu.com/

నర్సు కావాలనుకునే వారికి అలర్ట్.. నిబంధనల్లో కీలక మార్పులు..?

కేంద్ర ప్రభుత్వం నర్సింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మెడిసిన్ చదివే విద్యార్థులకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను ఏ విధంగా నిర్వహిస్తుందో అదే విధంగా నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం జాతీయస్థాయిలో పరీక్ష నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. ఇంటర్ మార్కుల ప్రాతిపదికగా ఇప్పటివరకు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయి. Also Read: పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గిన్నెదరిలో 9.5 డిగ్రీలు ఇకపై పరీక్ష నిర్వహించి మార్కులు, ర్యాంకుల ఆధారంగా నర్సింగ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 10, 2020 12:34 pm
    Follow us on

    NEET Exams
    కేంద్ర ప్రభుత్వం నర్సింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మెడిసిన్ చదివే విద్యార్థులకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను ఏ విధంగా నిర్వహిస్తుందో అదే విధంగా నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం జాతీయస్థాయిలో పరీక్ష నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. ఇంటర్ మార్కుల ప్రాతిపదికగా ఇప్పటివరకు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయి.

    Also Read: పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గిన్నెదరిలో 9.5 డిగ్రీలు

    ఇకపై పరీక్ష నిర్వహించి మార్కులు, ర్యాంకుల ఆధారంగా నర్సింగ్ కాలేజీలలో నీట్ ద్వారా మెడికల్ అడ్మిషన్లు జరుపుతున్నట్టుగానే అడ్మిషన్ల ప్రక్రియను జరపనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈనిర్ణయం అమలు కోసం జాతీయ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్ ‌ను తీసుకురానుందని సమాచారం. ఇప్పటికే కేంద్రం కొత్త నర్సింగ్ కమిషన్ బిల్లును రూపొందించగా nnmcbill-mohfw@nic.in ఈ మెయిల్ ద్వారా ఈ బిల్లు గురించి మేధావులు, నిపుణుల సలహాలను స్వీకరిస్తోంది.

    ఈ నిర్ణయం కనుక అమలులోకి వస్తే వచ్చే ఏడాది నుంచి కొత్త విధానంలో పరీక్షలు జరగనున్నాయి. గతంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటనను విడుదల చేసిన తరువాత ఇంటర్ లో మార్కులు, రిజర్వేషన్లను అనుసరించి ప్రవేశాలు కల్పించేవాళ్లు. బీఎస్సీ నర్సింగ్ 50 శాతం ఉత్తీర్ణతతో పాసై ఏడాది అనుభవం ఉన్నవాళ్లకు ఎంఎస్సీ నర్సింగ్ లో ప్రవేశం కల్పించేవాళ్లు.

    Also Read: పురీషనాళంలో బంగారం పెట్టుకొని వచ్చాడు.. ఇలా దొరికాడు

    ఇకపై నర్సింగ్ లో చేరాలంటే యూనిఫామ్‌ ఎంట్రీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎవరైతే నేషనల్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్ లో పాస్ అవుతారో వాళ్లు మాత్రమే నర్సింగ్ వృత్తి చేపట్టడం లేదా ఎంఎస్సీ కోర్సులో చేరేందుకు అర్హులవుతారు. తాజా బిల్లు ద్వారా కేంద్రం నర్సింగ్ కాలేజీల్లో సైతం కీలక మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.