National Dope Testing Laboratory Jobs 2021: న్యూఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పలు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారని సమాచారం. మొత్తం 8 ఉద్యోగ ఖాళీలు ఉండగా సైంటిస్ట్ బీ, సైంటిస్ట్ సీ, సైంటిస్ట్ డీ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోందని తెలుస్తోంది. 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎవరైతే సైంటిస్ట్ డీ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 1,19,132 రూపాయల వేతనం చెల్లిస్తారు. సైంటిస్ట్ డీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు డ్రగ్స్ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవంతో పాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. సైంటిస్ట్ సీ ఉద్యోగ ఖాళీలకు 40 ఏళ్ల లోపు వయస్సు ఉండటంతో పాటు డ్రగ్స్ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 1,03,881 రూపాయలు వేతనంగా చెల్లిస్తారు.
సైంటిస్ట్ బీ ఉద్యోగ ఖాళీలకు మాస్టర్స్ డిగ్రీ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 45 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 87,525 రూపాయలు వేతనంగా చెల్లించడం జరుగుతుంది. ఆఫ్‌లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక చేపడతారు. నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డీటీఎల్) ఈస్ట్ గేట్ నెం.10, జేఎల్‌ఎన్ స్టేడియం కాంప్లెక్స్, లోథి రోడ్, న్యూఢిల్లీ–110003 అడ్రస్ కు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. http://ndtlindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
