https://oktelugu.com/

వారికి ఎంఎస్ఎంఈ శుభవార్త.. భారీ వేతనంతో నోటిఫికేషన్ విడుదల..!

కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐడీటీ) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. సీఐడీటీకి చెందిన ఎంఎస్ఎంఈ టూల్ రూం నుంచి 29 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 2వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు establishment@citdinda.org […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 27, 2020 / 06:59 PM IST
    Follow us on


    కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐడీటీ) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. సీఐడీటీకి చెందిన ఎంఎస్ఎంఈ టూల్ రూం నుంచి 29 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 2వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది.

    ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు establishment@citdinda.org ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మెయిల్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. https://www.citdindia.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ టూల్ రూం ఈ నోటిఫికేషన్ ద్వారా టూల్ మేకర్, టూల్ ఇన్‌స్పెక్ష‌న్ ఇంజినీర్, ఇండస్ట్రీ ట్రైనర్, ఆటోమేషన్ ట్రైనర్, మెయింట‌నెన్స్ ఇంజినీర్, ప్రేస్ మెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ చేస్తోంది.

    బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీజీ, డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి విద్యార్హత, అనుభవంకు సంబంధించి మార్పులు ఉంటాయి. అనుభవాన్ని బట్టి ఈ ఉద్యోగాలకు భారీగా వేతనం లభిస్తుందని సమాచారం. దరఖాస్తు ప్రక్రియకు తక్కువ రోజులే ఉండటంతో వీలైనంత త్వరగా దరఖాస్తు చేస్తే మంచిది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల నుంచి గత కొన్ని రోజులుగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.

    కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.