Scholarship: నేషనల్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 2022 – 23 విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్ షిప్ కు సంబంధించి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో స్కాలర్ షిప్ అందనుందని సమాచారం అందుతోంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు.
ప్రస్తుతం బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఈ స్కాలర్ షిప్ కు విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. టాప్ 500 ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్స్/యూనివర్సిటీలలో ప్రవేశాలను బట్టి ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. http://nosmsje.gov.in/(x(1)s(hh4qzat3v3aandheccweekau))/default.aspx?aspxautodetectcookiesupport=1 ద్వారా స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: కేటీఆర్ కృషి ఫలించింది.. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ వచ్చింది.. ఐటీ నగరంగా హైదరాబాద్
ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పీహెచ్‌డీ చేసే విద్యార్థులు కూడా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రముఖ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హత ఉన్న విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తుండటంతో విద్యార్థులకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.
Also Read: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా గెలవబోతోంది?