నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఆర్మీలో ఉద్యోగాలు..?

గత కొన్ని నెలలుగా వరుసగా విడుదలవుతున్న నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండియన్ ఆర్మీలోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మిలటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ నుంచి 502 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మిలటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్ ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాఫ్ట్స్ మ్యాన్, సూపర్ వైజర్ బ్యారక్ ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదలైంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో బ్యాంక్ ఉద్యోగాలు..? అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు […]

Written By: Kusuma Aggunna, Updated On : March 26, 2021 12:40 pm
Follow us on

గత కొన్ని నెలలుగా వరుసగా విడుదలవుతున్న నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండియన్ ఆర్మీలోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మిలటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ నుంచి 502 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మిలటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్ ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాఫ్ట్స్ మ్యాన్, సూపర్ వైజర్ బ్యారక్ ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదలైంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో బ్యాంక్ ఉద్యోగాలు..?

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12వ తేదీ ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. భారత ఆర్మీలో పని చేయాలని భావించే వాళ్లకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, డీఆర్‌డీఓ లకు ఇంజనీరింగ్ సర్వీస్ లను అందించడంలో సహాయపడుతుంది.

సాయుధ బలగాలకు సేవలు అందించే అవకాశం ఇలాంటి సంస్థలలో చేరడం ద్వారా దక్కుతుందని చెప్పవచ్చు. మొత్తం 502 ఉద్యోగాలలో సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీలు 450 ఉండగా డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగ ఖాళీలు 52 ఉన్నాయి. ఆర్కిటెక్చురల్‌ అసిస్టెంట్‌షిప్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వాళ్లు డ్రాఫ్ట్స్‌మెన్‌‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలు..?

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, ఇతర అభ్యర్థులు 50 శాతం మార్కులు తెచ్చుకుంటే మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సికింద్రాబాద్‌, వైజాగ్‌ పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. https://mes.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.