https://oktelugu.com/

పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

ప్రముఖ కంపెనీలలో ఒకటైన మెకాన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 26 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాస్ట్‌ ఎస్టిమేషన్‌, మార్కెట్‌ రీసెర్చ్‌, రాజభాష, మినరల్‌, లీగల్‌, మెకానికల్‌, సివిల్‌, మైనింగ్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, ఇతర విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 25, 2021 / 04:08 PM IST
    Follow us on

    ప్రముఖ కంపెనీలలో ఒకటైన మెకాన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 26 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాస్ట్‌ ఎస్టిమేషన్‌, మార్కెట్‌ రీసెర్చ్‌, రాజభాష, మినరల్‌, లీగల్‌, మెకానికల్‌, సివిల్‌, మైనింగ్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, ఇతర విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా దరఖాస్తులకు చివరి తేదీని ప్రకటించాల్సి ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ మేనేజర్‌, స్పెషలిస్ట్‌, ఏజీఎం, డీజీఎం ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఇంజనీరింగ్‌ డిగ్రీ, లా డిగ్రీ, సీఏ, పీజీ డిగ్రీ/పీ డిప్లొమా, ఎంబీబీఎస్‌, ఎండీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ (నాన్‌ క్రిమిలేయర్‌), ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

    ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తులను http://www.meconlimited.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.