శుభవార్త చెప్పిన మోదీ సర్కార్.. వాళ్ల ఖాతాల్లో నగదు జమ..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా కష్ట కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్ల ఖాతాలలో నగదు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రం అందించే నగదును పొందాలనుకునే ట్రాన్స్ జెండర్లు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ట్రాన్స్ జెండర్లకు ఊరట కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ట్రాన్స్ జెండర్లు ప్రశంసిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ […]

Written By: Kusuma Aggunna, Updated On : May 25, 2021 4:17 pm
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా కష్ట కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్ల ఖాతాలలో నగదు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రం అందించే నగదును పొందాలనుకునే ట్రాన్స్ జెండర్లు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ట్రాన్స్ జెండర్లకు ఊరట కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ట్రాన్స్ జెండర్లు ప్రశంసిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు కేంద్రం సహాయం కావాలని కాల్స్, ఈ మెయిల్స్ చేయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తక్షణ సహాయంగా కేంద్రం 1,500 రూపాయలు జీవనాధార భత్యంగా ట్రాన్స్ జెండర్ల ఖాతాలలో జమ చేయనుంది. ట్రాన్స్‌జెండర్ సమాజానికి రోజువారీ అవసరాలను తీర్చడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం సహాయపడుతుంది.

ఎన్జీఓలు, కమ్యూనిటీ-ఆధారిత సంస్థలు ఈ ఆర్థిక సహాయం గురించి ట్రాన్స్ జెండర్లకు అవగాహన కల్పించాలని కేంద్రం కోరింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఆర్థిక సహాయం చేయడంతో పాటు రేషన్ కిట్లను అందించడం గమనార్హం. ఈ ఆర్థిక సహాయం పొందాలని భావించే ట్రాన్స్‌జెండర్లు ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ వంటి వివరాలను అందజేయాల్సి ఉంటుంది.

https://docs.google.com/forms/d/e/1faipqlsec0eobnsc_wkejzysof13dcwjabbm8jqeibib5ipdjcuewla/viewform లింక్ ద్వారా కేంద్రం అందించే సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో అర్హత ఉన్నవాళ్లు త్వరగా దరఖాస్తు చేసుకుంటే మంచిది.