https://oktelugu.com/

Jobs: కడప జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగ ఖాళీలు.. పది, ఇంటర్ అర్హతతో?

Jobs: కడప జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. మొత్తం 12 ఉద్యోగ ఖాళీలలో డీ.ఆర్.ఏ పోస్టులు 3 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 22, 2022 / 10:00 AM IST
    Follow us on

    Jobs: కడప జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

    Jobs

    మొత్తం 12 ఉద్యోగ ఖాళీలలో డీ.ఆర్.ఏ పోస్టులు 3 ఉండగా ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 3, రేడియోలజికల్ ఫిజిసిస్ట్ పోస్టులు 3, ఫిజిసిస్ట్ పోస్టులు 1, అప్టోమెట్రిస్ట్ పోస్టులు 1, ఎం.ఎన్.ఓ పోస్టులు 1 ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 12,000 రూపాయల నుంచి 37,100 రూపాయల వరకు వేతనం లభించనుంది.

    Also Read: Acharya Pre Release Event: ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫాన్స్ కి అదిరిపోయ్యే ప్రకటన చెయ్యబోతున్న చిరంజీవి – రాజమౌళి

    పదో తరగతి, ఇంటర్, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. అకడమిక్ మెరిట్, అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

    ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప, ఏపీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు చేసుకోవచ్చు. https://kadapa.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.

    Also Read: TRS Politics : బీజేపీతో ఫైట్.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ కు పనిచేస్తుందా?

    Recommended Videos: