APSFC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 20 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫైనాన్స్, టెక్నికల్,లా విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది. లా పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ/ పీజీడీఎం పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరుగుతుంది.
Also Read: అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాతపరీక్షను నిర్వహిస్తారు. రాతపరీక్ష మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన తుది ఎంపిక ప్రకియ జరుగుతుందని సమాచారం. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
2021 సంవత్సరం జనవరి 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://esfc.telangana.gov.in/index.jsp వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: టీఎంసీలో 175 ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.53,100 వేతనంతో?