JCL Recruitment: జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 63 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది.
ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఎంకాం పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 2021 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Jobs: ఓఎన్‌జీసీలో 21 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. అర్హులు ఎవరంటే?
అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ. 28,600 నుంచి రూ. 1,15,500 వరకు నెలకు వేతనం లభిస్తుంది. జూనియర్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 28,600 నుంచి రూ. 86,500 వరకు వేతనం లభిస్తుంది. ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
2022 సంవత్సరం జనవరి 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. https://www.jutecorp.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు లక్ష రూపాయలకు పైగా వేతనం లభిస్తుంది.
Also Read: Jobs: ప్రముఖ సంస్థ విప్రోలో ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?