ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన కాగ్నిజెంట్ ఫ్రెషర్స్ కు అదిరిపోయే తీపికబురు అందించింది. ట్రైనీ ప్రోగ్రామర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ) పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం జనవరి 6వ తేదీ లోపు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2020 సంవత్సరంతో పాటు 2021 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోకూడదు. పదో తరగతి, ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఎడ్యుకేషన్ లో రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు.
ప్రస్తుతం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసేవాళ్లకు ఎలాంటి ఎలాంటి స్టాండింగ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. https://careers.cognizant.com/in/en/job/00039714235/programmer-analyst-trainee వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.