ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన కాగ్నిజెంట్ ఫ్రెషర్స్ కు అదిరిపోయే తీపికబురు అందించింది. ట్రైనీ ప్రోగ్రామర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ) పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం జనవరి 6వ తేదీ లోపు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు సంవత్సరానికి 2,52,000 రూపాయలు వార్షిక వేతనంగా లభించేది. కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆఫీస్ లో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ జాబ్ ఫుల్ టైమ్ జాబ్ కాగా ఐటీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ టెక్నాలజీ/గణితం/ఫిజిక్స్/కెమిస్ట్రీ/స్టాటిస్టిక్స్ విభాగాలలో బీఎస్సీ లేదా బీసీఏ చదివిన వాళ్లు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
2020 సంవత్సరంతో పాటు 2021 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోకూడదు. పదో తరగతి, ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఎడ్యుకేషన్ లో రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు.
ప్రస్తుతం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసేవాళ్లకు ఎలాంటి ఎలాంటి స్టాండింగ్ బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. https://careers.cognizant.com/in/en/job/00039714235/programmer-analyst-trainee వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Jobs for freshers in a leading software company with a salary of rs 21000 per month
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com