https://oktelugu.com/

NIFT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో జాబ్స్.. రూ.50 వేల వేతనంతో?

NIFT Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్‌ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. మొత్తం 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 17, 2021 / 08:55 AM IST
    Follow us on

    NIFT Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్‌ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. మొత్తం 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.

    NIFT Recruitment

    సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. టీచింగ్, పరిశోధన అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. టెక్ మహీంద్రాలో జాబ్స్.. మంచి జీతంతో?

    రిజిస్ట్రార్‌ కార్యాలయం, హెడ్‌ ఆఫీస్, నిఫ్ట్‌ క్యాంపస్, హజ్‌ఖాస్, న్యూఢిల్లీ–110016 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపవచ్చు. రాత పరీక్ష, ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రాతపరీక్షను నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    రాతపరీక్షలో పాస్ అయితే ప్రజంటేషన్, క్లాస్ రూం లెక్చర్ కు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులోనూ పాస్ అయిన వాళ్లకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.56,100+ నిబంధనల ప్రకారం ఆలవెన్సులు లభిస్తాయి. https://nift.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    Also Read: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో?