Jobs: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జాబ్స్.. రాతపరీక్ష లేకుండా?

Jobs: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగంలో 21 ఉద్యోగ ఖాళీలకు భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో ఇంటర్నల్‌ అంబుడ్స్‌మెన్‌, చీఫ్‌ మేనేజర్‌ (కంపెనీ సెక్రటరీ), మేనేజర్‌ (ఎస్‌ఎంఈ ప్రొడక్ట్స్‌), డిప్యూటీ మేనేజర్‌ (చార్టర్డ్‌ అకౌంటెంట్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌) ఉద్యోగ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 25, 2021 7:42 pm
Follow us on

Jobs: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగంలో 21 ఉద్యోగ ఖాళీలకు భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో ఇంటర్నల్‌ అంబుడ్స్‌మెన్‌, చీఫ్‌ మేనేజర్‌ (కంపెనీ సెక్రటరీ), మేనేజర్‌ (ఎస్‌ఎంఈ ప్రొడక్ట్స్‌), డిప్యూటీ మేనేజర్‌ (చార్టర్డ్‌ అకౌంటెంట్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌) ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/ పీజీడీఎం, ఐసీఎస్‌ఐలో కంపెనీ సెక్రటరీ మెంబర్‌, సీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు అనుభవం ఖచ్చితంగా ఉండాలి. 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు. 2022 సంవత్సరం జనవరి 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://sbi.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.

అర్హత, అనుభవం ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల కొత్త ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్లకు మేలు జరుగుతోంది.