https://oktelugu.com/

Jobs:  శ్రీ పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌లో జాబ్స్.. నెలకు రూ.2 లక్షల వేతనంతో?

Jobs:  శ్రీ పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పది అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. iari.res.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసే ఛాన్స్ ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. 2022 సంవత్సరం జనవరి 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 12, 2022 / 08:49 AM IST
    Follow us on

    Jobs:  శ్రీ పద్మావతి చిల్డ్రన్‌ హార్ట్‌ సెంటర్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పది అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. iari.res.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసే ఛాన్స్ ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. 2022 సంవత్సరం జనవరి 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    Jobs

    https://www.tirumala.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 61450 నుంచి రూ.209200 వరకు వేతనం పొందే అవకాశం అయితే ఉంటుంది. డైరెక్ట‌ర్, శ్రీ ప‌ద్మావ‌తి చిల్డ్ర‌న్స్ హార్ట్ సెంట‌ర్‌, తిరుపతి 517507 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

    Also Read: నో బాల్ వేయని బౌలర్లు ఎవరో తెలుసా?

    ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. మొత్తం 8 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్‌ పీడియాట్రీషియన్, అసిస్టెంట్‌ అనెస్థెటిస్ట్, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్‌ అసిస్టెంట్‌ సిటీ సర్జన్, పీడియాట్రిక్‌ అసోసియేట్‌ థొరాసిక్‌ సర్జన్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    అర్హత, అనుభవం ఉన్నవాళ్లకు ఈ ఉద్యోగ ఖాళీల ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

    Also Read:  ఎయిర్ పోర్టుకు నీటి స‌ర‌ఫ‌రా ఆపేసిన ఎమ్మెల్యే కొడుకు.. చుక్క‌లు చూస్తున్న అధికారులు