Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీలో జాబ్స్.. నెలకు రూ.లక్ష వేతనంతో?

Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్ సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, కెమికల్‌/ బయలాజికల్‌ సైన్సెస్‌ లో పీ.హెచ్.డీ ఉన్నవాళ్లు […]

Written By: Kusuma Aggunna, Updated On : January 18, 2022 2:05 pm
Follow us on

Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్ సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, కెమికల్‌/ బయలాజికల్‌ సైన్సెస్‌ లో పీ.హెచ్.డీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 37 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 1,16,398 రూపాయల వేతనం లభించనుంది.

సీనియ‌ర్ సైంటిస్ట్ పోస్టుల‌కు ఎంపికైన వాళ్లకు నెలకు 1,33,936 రూపాయల వేతనం లభిస్తుంది. అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎగ్జామినేషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుంది. https://iicb.res.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. భారీ వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.