Jobs: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో విప్రో కంపెనీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ ఏడాదితో పాటు గత రెండేళ్లలో బీటెక్ పాసైన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. https://app.joinsuperset.com/company/wipro/elite-national-talent-hunt.html వెబ్ సైట్ లింక్ ద్వారా ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు సంవత్సరానికి మూడున్నర లక్షల రూపాయల వేతనం లభించే అవకాశం ఉంటుంది. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు సంవత్సరం పాటు అగ్రిమెంట్ బాండ్ ఉంటుంది. 2022 – 2023 సంవత్సరాలలో అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
అయితే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని షరతులు ఉన్నాయి. పది, ఇంటర్ ఫుల్ టైం కోర్సులు చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండకూడదు. ఒక సబ్జెక్ట్ బ్యాక్ ల్యాగ్ ఉన్నా ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కారని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను నింపాలి.
మొత్తం 128 నిమిషాల పాటు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష జరుగుతుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.