Jobs: ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీఎల్) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 30 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 20 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు, ఇంగ్లీష్ భాషలు చదవడం, మాట్లాడటంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 2021 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా 35,000 రూపాయల వేతనం లభించనుంది.
https://www.vcbl.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 11వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.vcbl.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
మొత్తం 150 మార్కులకు ఈ పరీక్ష జరగనుండగా 25 మార్కులను ఇంటర్వ్యూకు కేటాయిస్తారని సమాచారం. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా గ్రాడ్యుయేషన్ లో పాసై తెలుగు, ఇంగ్లీష్ భాషలు చదవడం వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Job vacancies in visakhapatnam co operative bank with 35000 salary
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com