Jobs In Andhra Pradesh: డిగ్రీ అర్హతతో విజయవాడలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Jobs In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని బోగట్టా. ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, లీగల్‌, మైనింగ్‌ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల […]

Written By: Kusuma Aggunna, Updated On : February 11, 2022 11:31 am
Follow us on

Jobs In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని బోగట్టా. ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, లీగల్‌, మైనింగ్‌ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

Jobs In Andhra Pradesh

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనంతో పాటు అలవెన్స్ ల రూపంలో భారీ మొత్తం అందనుంది. 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు. లా డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా (మైనింగ్‌), సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

Also Read: హిజాబ్ వివాదం: ఏమిటీ మత మౌఢ్యం?

ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని చెప్పవచ్చు. ఏపీఎండీసీ, కానూరు గ్రామం, పెనమలూరు మండలం, విజయవాడ 521137 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 2022 సంవత్సరం మార్చి 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

https://apmdc.ap.gov.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

Also Read: టీఆర్ఎస్ నేత‌లకు ప్ర‌జాప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వా? బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి సూటి ప్ర‌శ్న‌